Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొందరికేనా రిజర్వేషన్లు.. మిగతా వారి సంగతి?

కొందరికేనా రిజర్వేషన్లు.. మిగతా వారి సంగతి?

- ఇలా అయితే దేశం వాటినుంచి బయటపడేనా?- ఐఏఎస్ తల్లిదంద్రుల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా
- సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు

న్యూదిల్లీ, మే 22: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

కొందరే వీటిని పదేపదే అనుభవించడం ద్వారా మిగతావారికి అడ్డుపడుతున్నారని అభిప్రాయపడింది. గతంలో సీజేఐగా పనిచేసిన బీఆర్ గవాయ్ కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలను కొనసాగించాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలు పదేపదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకుని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తిస్థాయిలో స్థిరపడినప్పుడు ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని సŸంచలన ప్రశ్నలు సంధించింది. వెనుకబడిన వర్గాల్లోని 'క్రీమీలేయర' పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ విద్య, ఆర్థిక సాధికారత ద్వారా సమాజంలో ఒక స్థాయి లభిస్తుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల ద్వారా ఒకసారి ఉన్నతస్థాయికి చేరుకున్నాక కూడా మళ్లీ వారి పిల్లల కోసం కోటాను ఆశించడం సరికాదు. ఇలాగైతే మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండవచ్చని, కానీ రిజర్వేషన్ల ప్రయోజనం పొంది తల్లిదండ్రులు ఉన్నత స్థానాలకు వెళ్లినప్పుడు వారి పిల్లల పరిస్థితి మారుతుందని, ఇక్కడ ఒక సమతుల్యత అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలోని ఉన్నత వర్గాలే అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటే అదే వర్గంలోని అత్యంత వెనుకబడిన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫలాలు కొందరికే పరిమితం కాకుండా సమాజంలో కిందిస్థాయిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఓబీసీలకే పరిమితమైన క్రీ మీలేయర్ నిబంధనలను మరింత శాస్త్రీయంగా అమలు చేయడంపై న్యాయస్థానం దృష్టి సారించింది. 1992 నాటి చరిత్రాత్మక ఇంద్ర సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూనే వారిలో '¿మ్ర¡మీలేయర' వర్గాలను మినహాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.8 లక్షలు దాటిన వారితోపాటు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సీనియర్ బ్యూరోక్రాట్లు, మిలిటరీలో టాప్ ఆఫీసర్ల పిల్లలను ఆదాయంతో సంబంధం లేకుండా ¿మ్రీలేయర్ కింద పరిగణించి కోటా నుంచి మినహాయిస్తున్నారు. అయితే ఈ మినహాయింపులను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఇతర సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News