Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రిటికల్ మినరల్స్‌పై కీలక సమావేశాలు

క్రిటికల్ మినరల్స్‌పై కీలక సమావేశాలు

- డల్లాస్‌లో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు డల్లాస్ నగరంలో మంగళవారం ఘన స్వాగతం లభించింది.

బాల్టిమోర్ నగరంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన 'ఆటా' మహాసభల వేడుకల్లో పాల్గొన్న ఆయన అక్కడినుంచి డల్లాస్ చేరుకున్నారు. డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎనఆరఐ టీపీసీసీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ సొంత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాకతో స్థానిక ఎనఆరఐల్లో ఉత్సాహం నెలకొంది. డల్లాస్ నగరంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఉపకరించే విధంగా సింగరేణి అధికారుల బృందంతో కలిసి ఆయన క్రిటికల్ మినరల్స్ అంశంపై వివిధ బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. అత్యాధునిక సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికిన వారిలో నెహ్రూ కొమ్మినేని, అచ్యుత్ తుమ్మల, మధు ఇరుగు, వసంత్ బొబ్బల, రాజ్ బెజ్జల, హరినాథ్ శీలం, వడ్డే రాజేష్, ప్రమోద్ రెడ్డి, రిషిత్ సలవాది, రేవంత్ రెడ్డి, దుష్యంత్ బొక్క, సందీప్ తదితరులు ఉన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

\

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News