Dailyhunt
మక్కల కొనుగోళ్లు చేపట్టండి

మక్కల కొనుగోళ్లు చేపట్టండి

నిర్మల్, ప్రజాతంత్ర, మే 6: మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లి గ్రామ రైతులు నిర్మల్- భైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు.

ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనుగోలు కేంద్రాలు లేక పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పండిస్తే గిట్టుబాటు ధర లేక దళారులకు అమ్మాల్సిన దుస్థితి నెలకొందన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News