Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మలేషియాలో 6న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మలేషియాలో 6న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

- ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్- బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమ బ్రోచర్ ను మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ పేరును గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ లేని లోటు రెండున్నర ఏండ్లుగా కనిపిస్తున్నదన్నారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయలేకపోతున్నదని, కేసీఆర్ ఇచ్చిన పథకాలనూ ఇవ్వలేకపోతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అమెరికా దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో గతంలో తెలంగాణ ఆవిర్భావ దిన వేడుకలు డల్లాస్ లో జరిగాయని వివరించారు. దేశంలో బీజేపీ పాలనలో చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్న నిందితులను పట్టుకునే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభమవుతుందని, రైతులకు విత్తనాలు, ఎరువులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాత గురువు, చీకటి గురువు చెప్పినట్లు రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు .రైతాంగాన్ని ముంచి వ్యవసాయ సబ్సిడీలు దోచుకోవాలనే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిన ట్వీట్ చేసే రాహుల్ గాంధీ తెలంగాణలో మైనర్ బాలిక ఘటనపై ఎందుకు ట్వీట్ చేయ లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలకు, మహిళలకు శ్రీరామ రక్ష అని అన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News