అధికార ప్రతిపక్ష పార్టీలమద్య మరోసారి సవాళ్ళపర్వం మొదలైంది. నువ్వు ఒకటంటే నేను రెండంటా అన్నట్లుగా ఈ పార్టీల నాయకులు ఛాలెంజీలు విసురుకుంటున్నారు.
దీంతో తెలంగాణ రాజకీయాలు ఒకపక్క హాట్‌హాట్‌గా కొనసాగుతుండగా, వీరి ఛాలెంజీలిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యాయి. రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధిపేట తాజా పర్యటన ఈ రాజకీయ వేడికి కారణమైంది. సిద్ధిపేట సభకూడా ఇంతకుముందు నిర్వహించిన సిరిసిల్ల సభకు ఏమాత్రం తీసిపోనివిధంగానే సాగింది. యధావిది ప్రసంగం.
అదే దూకుడు. ఆదే ఆక్రోశం. అవే శాపనార్ధాలు. సభ ఉద్దేశ్యాన్ని లేదా తమ పాలనావిధాన వివరణకన్నా ప్రతిపక్షాలను దోషులుగా నిలబెట్టడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కువ సమయాన్నికేటాయించిన విషయం తెలియందికాదు. అదే విషయాన్ని సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు గుర్తుచేస్తూ, రేవంత్‌రెడ్డి తనతోపాటు కెసిఆర్, కెటిఆర్ పేర్లను 140 సార్లు ఉచ్చరించి దూషించడం పట్ల ఘాటుగా స్పందించారు.

