Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోమారు తెరపైకి ఫార్మూలా ఈ-రేస్ కేసు

మరోమారు తెరపైకి ఫార్మూలా ఈ-రేస్ కేసు

- కేటీఆర్ తదితరులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు - జూలై 31న విచారణకు రావాలని ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా`ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు కీలక అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్‌తో పాటు ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, ఏ-3 హెచఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎలఎన్ రెడ్డి, ఏ-4 స్పోర్ట్స్ కన్‌సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్‌రావుకు సమన్లు జారీ అయ్యాయి. 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ`కార్ రేసు కేసులో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు రూ.55 కోట్లు మళ్లించినట్లు ఏసీబీ అభియోగపత్రంలో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎలఎన్ రెడ్డిలు సహా ఎఫఈఓ సంస్థ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించింది. దీని నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఇప్పటికే లోతైన దర్యాప్తు జరిపి అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఏ-4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు, ఏ-5గా ఎఫఈఓ సంస్థపై కేసులు నమోదయ్యాయి.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News