Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మత ఆధారిత సంక్షేమ పథకాలు రద్దు

మత ఆధారిత సంక్షేమ పథకాలు రద్దు

- ఇమామ్‌లు, పూజారులకు గౌరవ వేతనం రద్దు- అన్నపూర్ణ' కింద అర్హులైన మహిళలకు రూ.3వేల సాయం
- బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కోల్‌కతా, మే 18: సువేందు అధికారి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సీఎం సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో మత ఆధారిత సంక్షేమ పథకాలను నిలిపివేయాలని నిర్ణయించారు. జూన్ నుంచి ఈ పథకాలు రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సంక్షేమ కార్యక్రమాలకు మతం రంగు పులమకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత టీఎంసీ సర్కార్ ఇమామ్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఆర్థికంగా బలహీనవర్గాల నుంచి వచ్చిన ఇమామ్‌లకT నెలకు రూ.2,500 ఆర్థిక సహయం అందజేసేవారు. అలాగే, మసీదులలో భక్తులను ప్రార్థనకు పిలిచే మౌజన్‌లకు కూడా ఇదేవిధమైన ఆర్థిక సహాయం అందించారు. ఈ రెండు పథకాలకు మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి నిధులు ఇచ్చేవారు. ఇమామ్‌ల మాదిరిగానే హిందూ పూజారులు లేదా పురోహితులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ఈ పథకం కింద ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన పురోహితులు నెలకు రూ.2 వేల గౌరవ వేతనాన్ని అందుకున్నారు. ఇక ప్రభుత్వం పలు ఇతర సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా ఐదు కీలక అంశాలపై చర్చ జరిపి ఆమోదం తెలిపారు. జూన్ 1 నుంచి అన్నపూర్ణ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు జూన్ 1 నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్య రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు చర్యలు ప్రారంభించారు. పీఎం విశ్వకర్మ, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం శ్రీస్కూల్స్ వంటి కేంద్ర పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఒక్కసారిగా రద్దు చేయబోమని సీఎం సువేందు ఈ సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News