Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మెడికల్ షాపుల బంద్ విజయవంతం

హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 20: ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 817 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణం బంద్ విజయవంతమైంది.

ఈ మేరకు మెడికల్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ షాపులు బంద్ పాటిస్తూ కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలు చేయడం అధికంగా డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా నాసిరకమైన మందులు మార్కెట్లో చలామణి అవుతున్నాయని, దీని ద్వారా చిన్న మెడికల్ షాపుల పై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ పాటిస్తున్నామన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News