Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపండి

మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపండి

దిల్లీ, ప్రజాతంత్ర, మే 6 : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రణాళిక డీపీఆర్‌ను రూపొందించి ఇప్పటికే సమర్పించామని తెలియజేశారు. దిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఫేజ్-3పై కేంద్ర మంత్రితో చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్ధం మెట్రోను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే మెట్రో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచఎల్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ప్రస్తుతం ఫేజ్-1 ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ సులువవుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-2లో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కి.మీ మేర విస్తరణకు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని సీఎం తెలిపారు. మెట్రో రైలు ఫేజ్-2 ప్పు్రాక్టును భారత ప్రభుత్వం- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-3 డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామన్నారు. హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ - భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్-3గా చేపట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, హెచఎంఆరఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్.వి.ఎస్.రెడ్డి, దిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News