Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నగరంలో వరుస అత్యాచారాలు

- సినిమా షూటింగ్ పేర మోసం.. యువతిపై ఇద్దరి అత్యాచారం- మరో కేసులో బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: నగరంలో వరుస దారుణాలు చోటుచేసుకున్నాయి.

సికింద్రాబాద్‌లో ఓ యువతిపై ఇద్దరు యువకులు రెండు రోజులపాటు అత్యాచారం సాగించగా ఇబ్రహీంపట్నంలో ఓ బిటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం చేశాడ. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సవిÖపంలో ఇద్దరు యువతులు నివసిస్తున్నారు. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిలో ఓ యువతికి సినిమా షూటింగ్ ఉందంటూ యువకుడు మాయమాటలు చెప్పి నమ్మించాడు. షూటింగ్ అనడంతో నమ్మిన యువతి యువకుడితో కలిసి సికింద్రాబాద్‌కు వెళ్లింది. సికింద్రాబాద్‌లోని గదికి తీసుకెళ్లిన యువకుడు తన స్నేహితుడితో కలిసి యువతిపై రెండు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితులు ఈనెల 16న ర్యాపిడో బుక్ చేయించి యువతిని ఇంటికి పంపించారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో స్నేహితురాలు ఆమెను గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించింది. అక్కడ వైద్యులు ఏం జరిగిందని ప్రశ్నించగా లైంగిక దాడి జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. ఈ ఘటనపై బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు గుర్తుతెలియని యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగించి బీటెక్ చదువుతున్న యువతిపై తోటి విద్యార్థి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉడుతల విజయ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్ ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 14న తనతోపాటు చదువుతున్న యువతిని టీ తాగుదామని ఆహ్వానించాడు. ఇద్దరూ కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లారు. టీ తాగిన అనంతరం తిరుగు ప్రయాణంలో విజయ్ మద్యం కొనుగోలు చేశాడు. తర్వాత బీడీఎస్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి కారులో ఆ యువతిని తీసుకెళ్లి ఆమెతో మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. ఉదయ్‌ను పోలీసులు అరెస్టు చేసి యువతిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News