Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్-2025 ప్రదానోత్సవం

నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్-2025 ప్రదానోత్సవం

- ముఖ్య అతిథిగా మాజీ విదేశాంగ కార్యదర్శి డాక్టర్ ఆసఫ్ సయీద్- నసీమ్ ఆరిఫీ మోనోగ్రాఫ్ ఆవిష్కరించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 ఉర్దూ భాష, సాహిత్యం, జర్నలిజం రంగాల అభివృ ద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు నసీమ్ ఆరిఫీ సేవలు చిరస్మరణీయమని మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి, సీనియర్ దౌత్యవేత్త డాక్టర్ ఆసఫ్ సయీద్ కొనియాడారు.

హైద రాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో శనివారం నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్-2025 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఈటీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ సహకారంతో జరిగిన ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా నసీమ్ ఆరిఫీ పై అకాడమీ ముద్రించిన చిరు పుస్తకాన్ని మోనోగ్రాఫ్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అకాడమీ ఏర్పాటు గూర్చి వివరిస్తూ 1996 సంవత్సరంలో ఉమ్మ డి రాష్ట్రంలో అకాడమీ స్థాపించినప్పుడు తొలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మీడియా అకా డమీ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టుల జీవిత చరిత్రలు, అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు 12 మోనోగ్రాఫ్ ను విడుదల చేసినట్లు తెలిపారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో పుస్తకాలు చదివేందుకు సమయం దొరకని పరిస్థితుల్లో ఈ మోనోగ్రాఫ్లు జర్నలిజం రంగంలో నిపుణుల గురుంచి తెలుసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. కార్యక్రమాన్ని సీఈటీఐ ఫౌండేషన్ వ్యవస్థా పకులు సయ్యద్ బషారత్ అలీ నిర్వహించారు. అవార్డుల ప్రాముఖ్యతపై మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మాస్ కమ్యూని కేషన్ అండ్ జర్నలిజం విభాగం డీన్‌, హెచ్ఓడీ ప్రొఫెసర్ ఎబ్దేశామ్ అహ్మద్ ఖాన్ ప్రసంగించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు అమీర్ ఉల్లా ఖాన్ ఉర్దూ మీడియా అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో ప్రతిభ కన బరిచిన ఢిల్లీకి చెందిన మాసూమా మురాదాబాద్ కి జీవిత సాఫల్య పురస్కారం, యామీ న్అన్సారీ, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అలీమొహియుద్దీన్, ఎం.డ్. ఫజల్ బైగ్, రోహిణి సింగ్ కు నసీమ్ అరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్- 2025 ప్రదానం చేశారు. కార్యక్ర మంలో మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టు మాజిద్, పలువురు సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, సాహితీవేత్తలు, ఉర్దూ భాషాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News