Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరంతర కృషితోనే బీసీల సామాజిక-ఆర్థికాభివృద్ధి

నిరంతర కృషితోనే బీసీల సామాజిక-ఆర్థికాభివృద్ధి

- కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : సమాజంలోని వెనుకబడిన, బలహీనవర్గాల సామాజిక-ఆర్థికాభివృద్ధి కోసం నిరంతర కృషి అవసరమని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ పేర్కొన్నారు.

ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయనŸ సోమవారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పేద, వెనుకబడినవర్గాల అభివృద్ధి కోసం అమలవుతున్న ముఖ్య సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించారు. వీటిలో ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ విద్యార్థి స్కాలర్‌షిప్స్, పౌర హక్కుల రక్షణ వ్యవస్థ, ఎస్సీ/బీసీ హాస్టళ్ల నిర్మాణం, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సమగ్ర పునరావాసం, జాతీయ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సుధాంశ్ పంత్ మాట్లాడుతూ కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసించారు. గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ మరింత కృషి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన పెండింగ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరింత ఆర్థిక సహాయం పొందడానికి ఆస్కారం ఉందని, దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మరింత విస్తృత ప్రయోజనాలు అందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ పేరెంటల్ సపోర్ట్ చట్టాన్ని ఒక ప్రగతిశీల చర్యగా ప్రశంసిస్తూ సామాజిక రక్షణలో ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాల ప్రస్తుత స్థితిపై సబ్యసాచి ఘోష్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, కొనసాగుతున్న కార్యక్రమాలు, అమలు విధానాలను వివరించడంతోటు కేంద్రం నుండి మద్దతు, స్పష్టత అవసరమైన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ, బీసీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News