Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'నీట్' పేపర్ లీకుకు మరొకరు బలి

'నీట్' పేపర్ లీకుకు మరొకరు బలి

- ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

యపుర, మే 16: నీట్`యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీక్ వల్ల పరీక్ష రద్దవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ప్రదీప్ మహిచ్ తన ఇద్దరు సోదరులతో కలిసి సికార్‌లో నివసిస్తున్నాడు. అక్కడే ఒక ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాడు. ఈనెల 3న జరిగిన నీట్`యూజీ పరీక్ష రాశాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం అతడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన అతడి సోదరి వెంటనే స్థానికుల సహాయంతో సవిÖప హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పరీక్షను బాగా రాసినట్లు తన కుమారుడు చెప్పాడని, 650 మార్కులు వస్తాయన్నాడని ప్రదీప్ తండ్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ సీటు ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రద్దవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'నీట' రద్దు నేపథ్యంలో దిల్లీ, యÖపీల్లోనూ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

పేపర్ లీక్ కేసు.. పుణేకు చెందిన బాటనీ టీచర్ మనీషా అరెస్ట్

పుణె : 'నీట్' పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో కీలక సూత్రధారి, పుణేకు చెందిన బోటనీ టీచర్ మనీషా మందారేను సీబీఐ అరెస్టు చేసింది. 'నీట' బయాలజీ ప్రశ్నాపత్రం లీక్ కావడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మనీషా బోటనీ విభాగంలో సీనియర్ అధ్యాపకురాలు. ఆమెను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 'నీట్ ' ప్రక్రియలో స్జబెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా నియమించింది. ఏప్రిల్ నుంచి ఆమె కొందరు 'నీట్ ' అభ్యర్థులకు తన ఇంటి వద్దే శిక్షణ తరగతులను నిర్వహించారు. ఆ సమయంలోనే ఆమె వారికి పరీక్షకు సంబంధించిన బోటనీ, జువాలజీ పేపర్లలోని ప్రశ్నలను లీక్ చేశారు. ఆ ప్రశ్నలను నోట్ బుక్‌లో రాసుకోవాలని, టెక్ట్స్‌బుక్‌లో మార్క్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆమె లీక్ చేసిన ప్రశ్నలు 3వ తేదీన జరిగిన 'నీట' ప్రశ్నలతో సరిపోలినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో పుణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. కులకర్ణి కొన్నేళ్లుగా 'నీట' ప్రశ్నాపత్రం రూపొందించే అధికారిక నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ఈ లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు దిల్లీ, జైపూర్, నాసిక్, పుణె, గురుగ్రామ్, అహిల్యానగర్‌ల నుంచి తొమ్మిదిమందిని సీబీఐ అరెస్టు చేసింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News