Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పరువు నష్టం కలిగించేలా వార్తల ప్రసారం

- కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

\హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

తనపై విÖడియా, సోషల్ విÖడియా, యÖట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడొద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరుతో ఇప్పటివరకు సోషల్ విÖడియాలో, యÖట్యూబ్ ఛానళ్లలో ఉన్న వీడియోలను తొలగించాలని కోర్టును బండి సంజయ్ కోరారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని న్యాయస్థానానికి సంజయ్ వివరించారు. ఈ క్రమంలో సోషల్ విÖడియా, యÖట్యూబ్, విÖడియాలో బండి సంజయ్‌పై వచ్చిన కథనాలను వెంటనే తొలగించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి కథనాలు ప్రసారం చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News