Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీసుల ఎదుట లొంగిపోయిన భగీరథ్!

పోలీసుల ఎదుట లొంగిపోయిన భగీరథ్!

- హైకోర్టు బెయిల్ నిరాకరణ..- లుకౌట్ నోటీసుల జారీతో ఉచ్చు బిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న పోక్సో కేసులో శనివారం రాత్రి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. న్యా యవాదుల సమక్షంలో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. లుకౌట్ నోటీసులతో ఉచ్చు బిగిసింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం, చట్టపరమైన రక్షణ లభించకపోవడంతో భగీరథ్ పోలీసులకు లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

.. బండి సంజయ్ నివాసంలో సోదాలు

భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. అంతకుముందు హైదరాబాద్‌లోని బండి సంజయ్ నివాసంలో తనిఖీలు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు దిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లో బృందాలుగా గాలింపు కొనసాగిస్తున్నారు. అతని కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో విచారణ నిమిత్తం రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయగా విచారణకు అతను గైర్హాజరయ్యారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

సత్యమేవ జయతే

మా అబ్బాయి బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం ఈరోజు అప్పగించాను. నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డ అయినా.. సామాన్యుడైనా సమానమే అని. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్‌లో అప్పగిద్దామనుకున్నా, లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని లాయర్ల ద్వారా విచారణ కోసం పోలీసులకు అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను.

- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News