Dailyhunt
'ప్రగతి ప్రణాళిక'లో భాగస్వాములు కావాలి

'ప్రగతి ప్రణాళిక'లో భాగస్వాములు కావాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా గురువారం నుంచి ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు విజయవంతంగా జరుగుతున్నాయి.

దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర గీతం 'జయజయహే' ఆలపించారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ విజన్-2047తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్దేశమన్నారు. మనమందరం ఈ ప్రగతి పాలనలో భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలతోపాటు, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సాధికారత కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని Ÿసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని సీఎస్ అన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News