Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖ అప్పగింత

ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖ అప్పగింత

- ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ఆమోదం

న్యూదిల్లీ, జూలై 25 : ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్‌ జోషికి అప్పగించింది.

ప్రస్తుతం కన్జ్యూమర్‌ ఎఫైర్స్ శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించారు. కర్ణాటకలోని ధార్వాడ్‌ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రహ్లాద్‌ జోషి.. ఆహార, ప్రజాసరఫరా వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. భారత్‌ చొరవతో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News