Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకృతి చిత్రాలు

ప్రకృతి చిత్రాలు

రేఖా రామానుజన్

అలలేని కొలనులో శిలలా జాబిలి

* రంగులతాడు విసిరి
చూపుల్ని కట్టేసింది
హరివిల్లు

* నిద్రలో పాపాయి నవ్వు
నింగినొదిలేసాయి
తారలు

* నింగి పుష్పాలు

పరిమళించవు
ప్రకాశిస్తాయి

* నిద్ర లేచిన సూర్యుడికి
నిశ్చల తటాకం
నిలువుటద్దం

* నీడ
కొంచెమే
నిటారు చెట్టుకు

* నింగి కంటే
నదికే బాగుంది
నీలి చీర

* వెన్నెల దూకగానే
నదిలో వెండి పొర
పరచుకుంది

* కడలి హోరెత్తుతోంది
కన్నీళ్లు ఇప్పుడే
కలిపొచ్చాను

* మా గోడ మీద
మోజు పడింది
పక్కింటి మల్లెతీగ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News