Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాదకు ఆహ్వానం

ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాదకు ఆహ్వానం

రాజమహేంద్రవరం,మే 20 : చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో వచ్చే నెల 6, 7వ తేదీల్లో రాజమహేంద్రవరం నగరంలో జరిగే 7వ ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాద శ్రీనివాస్ కు ఆహ్వానం అందింది.ఈ మేరకు శ్రీశ్రీ కళా సంస్థ జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ పి.పార్థ సారథి నుంచి ఆయనకు లేఖ అందింది.

తెలుగు భాష , సాంస్కృతిక, కళావికాసానికి , సాహిత్య చైతన్యానికి ఎంతో దోహదం చేసే తెలుగు మహాసభలకు తనకు ఆహ్వానం రావడం పట్ల శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో జన్మించిన శ్రీపాద శ్రీనివాస్ గత 24 ఏళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష కార్యాలయంలో పనిచేస్తున్నారు.ఆయన తన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా ఎంచుకుని రాజకీయ, సామాజిక చైతన్యంతో ఎన్నో కథలు, కథానికలు రాసి రచయితగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు పరిచయమయ్యారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా 'గోదావరి అలలలో అమ్మ పిలుపు', నిరీక్షణ,అమ్మ ముడుపు, తదాదిగా పదుల సంఖ్యలో కథలు, కొన్ని భావ కవితలు వినిపించారు.పలు పత్రికలలో కథలు కూడా ప్రచురించి, తనలో ప్రబలంగా ఉన్న సాహితీ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కథలూ కథానికలను గుండె చప్పుళ్ళు, మనసున ఉన్నది', అంతరంగం' పేరుతో విభిన్నమైన మూడు సంపుటాలుగా ప్రచురించారు. చట్ట సభలలో గోదావరి గళం పేరుతో ఓ బృహత్ పుస్తకం శ్రీపాదలోని రాజకీయ అభిరుచికి అద్దం పట్టేదిగా నిలిచింది. ఆ మేరకు ఆయన ఇటీవల వైద్యుల గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక వివేకానంద స్ఫూర్తి రత్న పురస్కారం అందుకున్నారు. అంతే కాక మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక పురస్కారం, విపంచి ఉగాది పురస్కారాలను కూడా అందుకున్నారు. కాగా, తెలుగు మహాసభలలో పాల్గొనే అవకాశం రావడం మధురమైన జ్ఞాపిక అని శ్రీపాద తెలిపారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News