Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుష్కర పనులు గడువులోపు పూర్తి కావాలి

పుష్కర పనులు గడువులోపు పూర్తి కావాలి

- సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలి- అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ప్రతిష్ఠాత్మకమైన గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల పనులన్నింటినీ నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

పుష్కరాల సందర్భంగా రాష్ట్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధతపై అన్ని సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరాల కోసం చేపడుతున్న ఏర్పాట్లు, కార్యాచరణపై అధికారులు సమగ్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సుమారు ఎనిమిది కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలు సజావుగా జరిగేలా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం, భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందించడం, అన్ని శాఖల మధ్య సమన్వయం సాధించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన కోసం మొత్తం 67 ప్రాంతాలను గుర్తించారు. భక్తుల ప్రాధాన్యత, రాకపోకల సంఖ్యను అంచనా వేసి ఈ ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో మొదటి కేటగిరీలో 11 ప్రాంతాలు, రెండో కేటగిరీలో 13 ప్రాంతాలు, మూడో కేటగిరీలో 43 ప్రాంతాలను చేర్చారు. అన్ని మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళిక, వివిధ శాఖల మధ్య సమన్వయం, పనులపై నిరంతర పర్యవేక్షణ ఎంతో అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. పుష్కరాలకు సంబంధించిన పనులకు ప్రాధాన్యతనిస్తూ పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News