Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రేపటినుంచి ఉప్పల్‌-వరంగల్ రహదారి మూసివేత

- ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైవోవర్ పనుల కారణంగా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం నుండి ఉప్పల్ రింగ్ రోడ్డులోని వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నారు.

అందువల్ల ప్రస్తుతం జీహెచఎంసీ ఉప్పల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట బస్సుల స్టాప్‌ను తాత్కాలికంగా నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట వైపు ప్రయాణించాల్సిన ప్రయాణికులు నల్ల చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వరంగల్ బస్ స్టాప్ నుంచి బస్సుల ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్లాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు ఉండే అవకాశమున్నందున వాహనదారులు, ప్రయాణికులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ప్రయాణించవలసిందిగా సూచించారు. వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు మే ఫీల్ హోటల్ దాటిన తర్వాత ఉప్పల్ భగాయత్ ద్వారా నాగోల్, సర్వీస్ రోడ్డు ద్వారా వెళ్లి ఫ్లైఓవర్ కింద యూ టర్న్ తీసుకుని హైదరాబాద్ వెళ్లాలి. హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్ పక్క నుండి బీరప్ప గడ్డ మీదుగా వెళ్లి ఎన్‌హెచ్ 163 మీదుగా వరంగల్లు వెళ్లాలి. ఉప్పల్ భగాయత్ రోడ్డు చాలా చిన్నది కనుక హైదరాబాదు వచ్చే వరంగల్ బస్సులు, లారీలు పెద్ద వాహనాలన్నీ కూడా ఓఆరఆర్ హయత్ నగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. అలాగే హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు ఎల్బీనగర్, హయత్‌నగర్ మీదుగా ఘట్‌కేసర్ నుండి వరంగల్ వెళ్లాలి. ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా పోలీసు శాఖ, సంబంధిత అధికారుల సూచనలను వాహనదారులు పాటించి సహకరించాలి.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News