Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రాక

రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రాక

- ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అయిలయ్య

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.100 కోట్ల వ్యయం కాగల పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం యాదగిరిగుట్ట విచ్చేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భద్రతా చర్యలు, పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. అలాగే ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించి అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయిలయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రాకతో టెంపుల్ సిటీ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News