అనేక రకాల సైబర్ నేరాల అనుసంధానం
కొద్ది నెలల కిందట సత్తుపల్లి కేంద్రంగా 60 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. వీరిని జైలుకు పంపిన ఆ తర్వాత బెయిల్ పై వచ్చి దర్జాగా తిరుగుతుండడంతో సత్తుపల్లి , కల్లూరు ప్రాంత యువకులు అదే దారి పడుతున్నారు.
ఈ నెట్‌వర్క్ కు స్టాక్ మార్కెట్ పెట్టుబడి మోసాలు, క్రిప్టో పెట్టుబడి పేరుతో మోసాలు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు, ఓటీపీ మోసాలు, మ్యాట్రిమోనీ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు వంటి పలు రకాల సైబర్ నేరాలతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో సిట్ కు కేటాయించారు. ఈ మోసాల ద్వారా వచ్చిన నిధులను మ్యూల్ ఖాతాల ద్వారా పలు బ్యాంకులకు బదిలీ చేసినట్లు అధికారు లు అప్పట్లో గుర్తించారు. నిధుల ప్రవాహం ఎక్కడి నుంచి ప్రారంభమైంది. చివరకు ఎవరి ఖాతాలకు చేరింది, విదేశీ సర్వర్లు లేదా క్రిప్టో వాలెట్ల వినియోగం ఉందా. అనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న ఇతర సైబర్ నేర ముఠాలతో ఈ నెట్‌వర్క్ కు సంబంధాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించగా, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు పోట్రు ప్రవీణ్ బిఆర్ఎస్ యువ నేతగా ఉన్నారు. సైబర్ మోసాల ద్వారా కొల్లగొట్టిన సొమ్మును తన వ్యక్తి గత రాజకీయ పలుకుబడి కోసం వినియోగించారు. వందలు అడిగిన వారికి వేల రూపాయలు అందజేశాడు. ప్రభుత్వం మారగానే ఆయన గుట్టు బయటపడింది. ఈ కేసులో ఇతర నిందితులు పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్ ఉన్నారు. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి స్థాయి అనుచరులుగా ఇందులో కొందరికి ముద్ర ఉండడంతో వారిని ఆఖరున అరెస్ట్ చేశారు. రూ.547 కోట్ల అక్రమ లావాదేవీలు ఉన్నట్లు స్థానిక పోలీసులు తేల్చారు. ప్రస్తుతం ఈ కేసులో విదేశీ లింకులు రూ.547 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పైగా అక్రమ ఆర్థిక లావాదేవీల ఉండడం, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నమోదైన రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. వి.ఎం. బంజారా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుతో పాటు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై లోతైన విచారణ చేపట్టనున్నారు. బ్యాంకు లావాదేవీల డిజిటల్ ట్రైల్ ఆధారంగా కీలక సూత్రధారులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు
