Dailyhunt

సైబర్‌ నేరాల కేసు మరో కీలక మలుపు

- మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగుల అరెస్ట్

మ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: సత్తుపల్లి సైబర్‌ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

సైబర్‌ క్రైమ్‌ కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణలను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు. రూ.549.95 కోట్లు దోచుకున్న ఈ కేసులో ఉడతనేని వికాస్‌ చౌదరి, బొప్పన నాగప్రియ, చండ్రుగొండకు చెందిన బ్యాంక్‌ మేనేజర్‌ అఖిల్‌ అబ్దుల్‌ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే, విచారణ సందర్భంగా తాజాగా అరెస్టయిన ముగ్గురు నిందితులు వారికి సహకరించినట్లు తేలింది. ఈ మేరకు కృప, శ్రీహరిబాబు, బీఆర్‌వో రాధాకృష్ణను సీఐ శ్రీహరి అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వసుంధర యాదవ్‌ తెలిపారు. నిందితులంతా అంతర్జాతీయ సైబర్‌ నేరస్థులతో చేతులు కలిపినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులు, బెట్టింగ్‌, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్‌, క్రిప్టొ కరెన్సీ వంటి మోసాలకు నిందితులు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 24 మందిపై కేసు నమోదు కాగా ఇప్పటికే చాలామందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News