Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్‌లో కాల్పులు

శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్‌లో కాల్పులు

- ముగ్గురి మృతి.. పోలీసుల దర్యాప్తు

శాన్ డియాగో, మే 19: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. శాన్ డియాగోలోని ఒక ఇస్లామిక్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు.

మసీదు, ఇస్లామిక్ పాఠశాల ఉన్న సముదాయంలో ఈ దాడి జరిగింది. జాతి విద్వేషం, మతపరమైన ద్వేషమే ఈ ఘటన వెనుక కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన ఈ ఘటనలో దాడికి పాల్పడిన ఇద్దరు యువకులు కూడా తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తమను తామే కాల్చుకున్నట్లు భావిస్తున్నామని పోలీస్ చీఫ్ స్కాట్ వాల్ వెల్లడించారు. ఇది ఇస్లామిక్ సెంటర్‌లో జరిగిన దాడి కావడంతో జాతి వివక్షాపూరిత నేరంగా దర్యాప్తు చేస్తున్నామని విÖడియాకు తెలిపారు. దుండగుల వయస్సు 17, 19 సంవత్సరాల మధ్య ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. మృతులలో ఒకరు ఇస్లామిక్ సెంటర్‌లో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నారని, ఆయన సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. మరణించిన ముగ్గురూ పెద్దవారేనని, పాఠశాల పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఇస్లామిక్ సెంటర్ ఇమామ్ తాహా హసన్ మాట్లాడుతూ తమ కేంద్రం ముస్లింలతోపాటు ముస్లిమేతరులు కూడా ప్రార్థనలు, విద్య కోసం వచ్చే ప్రదేశమని చెప్పారు. ప్రార్థనా స్థలాలపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టాడ్ గ్లోరియా మాట్లాడుతూ శాన్ డియాగోలో జాతి విద్వేషానికి స్థానం లేదని, ముస్లిం సమాజానికి పూర్తి రక్షణ కల్పిస్తామని హావిÖ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇది అత్యంత భయంకరమైన ఘటన అని పేర్కొన్నారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు సారా జాకబ్స్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. స్థానిక పోలీసులతోపాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) కూడా దర్యాప్తులో పాల్గొంటుందని ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News