Dailyhunt

సోలిపూర్ రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు

- రూ.8 కోట్ల విలువైన 3415.961 మెట్రిక్ టన్నుల ధాన్యం గల్లంతు

వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సోలిపూర్ గ్రామంలోని ఎస్ఎల్ఎన్ఎస్ రైస్ మిల్లులో మంగళవారం సివిల్ సప్లై అధికారుల తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి.

అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విలువైన ధాన్యం గల్లంతైనట్లు గుర్తించారు. 2022-23 ఖరీఫ్, రబి, 2023-24 ఖరీఫ్ సీజన్‌లకు సంబంధించి ఆ రైస్ మిల్లుకు మొత్తం 7303.560 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కేటాయించారు,. ఇందులో 3874.477 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ సీఎంఆర్ రూపంలో పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. అయితే ఇంకా 3429 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అప్పగించాల్సి ఉండగా, మిల్లులో కేవలం 13.32 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 3415.961 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు నిర్ధారించారు.ఈ ధాన్యం విలువ సుమారు రూ.8 కోట్లుగా ఉంటుందని జిల్లా సరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. తనిఖీల్లో డీటీ పరమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News