Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు జడ్జిలు

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు జడ్జిలు

- కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ విడుదల

న్యూదిల్లీ, జూన్‌ 1: సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ వెలువరించింది.

ఈ జాబితాలో సీనియర్‌ న్యాయవాది వి మోహన, ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ చంద్రశేఖర్‌, ప్రస్తుత పంజాబ్‌ హరియాణా హైకోర్టు సీజే జస్టిస్‌ షీల్‌ నాగు,ప్రస్తుత మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ , జమ్మూకశ్మీర్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ అరుణ్‌ పళ్లి ఉన్నారు. ఇటీవలే సీజేఐ నేతృత్వంలోని కొలీజియం వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో వి. మోహన ఒక్కరే సీనియర్‌ న్యాయవాది. న్యాయవాది మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అయిదేళ్ల లా డిగ్రీ మొదటి బ్యాచ్‌ విద్యార్థి. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సీఎస్‌ వైద్యనాథన్‌ల వద్ద జూనియర్‌గా ఉన్నారు. 1996లో ఏఓఆర్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. వివిధ కేసుల్లో సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌సిబల్‌, కె.కె.వేణుగోపాల్‌, పి.చిదంబరం, అరున్‌జైట్లీ, అంద్యార్జునలతో కలిసి పనిచేశారు. 2015 ఏప్రిల్‌ 23న సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. ఈమె చేరికతో సుప్రీం కోర్టులో మహిళా జడ్జిల సంఖ్య 2కు చేరినట్లయింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News