Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,730

న్యూదిల్లీ, జూన్ 5 : భారత్‌లో బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలో శుక్రవారం కూడా స్వల్ప స్థాయిలో కోత పడింది.

కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధర కూడా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,730కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.380ల మేర కోత పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర కూడా రూ.350ల మేర తగ్గి రూ.1,42,750కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ధరలో రూ.5 వేల మేర కోత పడింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.8 లక్షలుగా ఉంది. విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,57,960గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,44,300గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,730గా, 22 క్యారెట్ల ధర రూ.1,42,750గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,880గా, 10 గ్రాముల ఆభరణాల పసిడి ధర రూ.1,42,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర 4,444 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ నేపథ్యంలో కొత్త పెట్టుబడుల విషయంలో మదుపరులు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి రూ.95.74 వద్ద ముగిసింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News