Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

తమిళనాడులో విదేశీయుల ఓటు

- ఇమ్మిగ్రేషన్ అధికారుల దర్యాప్తుతో వెలుగులోకి- పదిమందిని అరెస్టు చేసిన పోలీసులు

చెన్నై, మే 15: తమిళనాడు ఎన్నికల్లో విదేశీయులు ఓటేసిన వైనం బయటపడింది.

ఎన్నికల అధికారుల కళ్లు గప్పి ఓట్లేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత విదేశీయులు ఓటింగ్‌లో పాల్గొన్నట్లు వచ్చిన సమచారంతో దర్యాప్తు జరిపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పదిమందిని అరెస్టు చేశారు. గత ఎన్నికల్లో ఓట్లేసిన వారిని చెన్నై, మధురై విమానాశ్రయాలలో అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎక్కువగా శ్రీలంకకు చెందినవారే ఉన్నారు. విదేశీ వీసా ఉండి కూడా తమిళనాడులో ఎలా ఓట్లు వేశారనేది ప్రశ్నార్థంకంగా మారింది. అరెస్టయిన 10 మందిలో రంజిని (59), సర్ఫుదీన్ (68), నీలాంతి (44), జయంతన్ (40), చార్లీ బాలచంద్రన్ (48), చక్రవర్తి లోగప్రియ (50), సునీత చక్రవర్తి (48) మొదలైన వారు శ్రీలకం పౌరులు. వీరితోపాటు బ్రిటన్‌కు చెందిన అయ్యదురై (53), ఇండోనేషియాకు చెందిన టిటిన్ మరియాట్టి (47), కెనడాకు చెందిన జిత్తేంద్రనాథ్ (38) ఉన్నారు. చెన్నై, మధురై ఎయిర్‌పోర్టులలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్తున్న క్రమంలో వారి చూపుడు వేలికి ఇంకు గుర్తు ఉండటాన్ని గమనించారు. విదేశాల వీసా కలిగి ఉండి ఇంకు మార్కు ఉండటమేంటనే అనుమానంతో విచారించారు. దీంతో వాళ్లు మొన్నటి ఎన్నికల్లో ఓటేసినట్లు ఒప్పుకున్నారు. శ్రీలకం వీసాతో వచ్చిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డులు ఉండటం గమనార్హం. విదేశీయులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం నేరమని, జారీ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మొటి అరెస్టు మంగళవారం (మే 12) జరిగినట్లు పోలీసులు తెలిపారు. విదేశీయులు ఓటు వేశారనే అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కారణంగా లక్షల ఓట్లు తొలగించారు. ఈ పరిస్థితుల్లో విదేశీ ఓటర్లు ఎలా ఓట్లు వేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తమిళనాడులో 74 లక్షల పేర్లను తొలగించారు. దాదాపు 28 లక్షల కొత్త ఓటర్లను కలిపారు. ఒకవైపు 'సర్' ప్రక్రియ పూర్తయ్యాక కూడా విదేశీయులు ఎలా ఓట్లేశారని ప్రశ్నిస్తున్నారు. ఓటరు లిస్టులో పేర్లు ఉంటే ఎన్నికల అధికారులు తొలగించలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే 'సర' పక్రియ సరిగ్గా జరగటం లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News