"తెలుగు కథా సాహిత్యంలో సీమాంధ్ర సంకలనకర్తలు సాగించిన అక్షర ద్రోహాన్ని సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు గతంలోనే ఖచ్చితమైన లెక్కలతో (Statistical Evidence) నిరూపించారు: ఒకాయన 36 ఏళ్లుగా ఏటా వేసే కథాసంకలనం ో 14 కథల్లో రెండు మూడు తెలంగాణ కథలు వేసి ఇదే తెలుగు కథ అంటారు.
ఈ వివక్షని అధిగమించడానికి తెలంగాణలో జిల్లాల వారీగా కథా సంకలనాలు వెలువడ్డాయి. సమాంతరంగా భారతీయ సాహిత్యం తెలుగు కథలు, అలాగే సంగిశెట్టి, స్కైబాబా సంపాదకత్వంలో ఏటా తెలంగాణకా సంకలనాలు వెలువడుతున్నాయి. ఇలా తెలంగాణ సొంత అస్తిత్వంతో ముందుకు సాగుతున్నది.."
ముసుగులు వద్దు - అస్తిత్వ స్పష్టత రావాలి.
- బి ఎస్ రాములు
సామాజిక తత్వవేత్త
ఫోన్: 8331966987
భారతదేశంలో భౌగోళిక సరిహద్దులు మారి కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ, భావజాల రంగంలో, సాహిత్య పీఠాలలో పాత వలసప్రాంత ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏప్రిల్-జూన్ 2026 నాటి తెలంగాణ సాహిత్య అకాడెమీ పత్రిక 'పునాస' లో వెలువడిన వ్యాసాలే ఇందుకు సజీవ సాక్ష్యం. "తెలుగు సాహిత్యం" అనే ఒక ఉమ్మడి సార్వజనీన ముసుగును (Universal Mask) కప్పుకొని..70-. 90 శాతం ఆంధ్ర ప్రాంత రచనలను, వారి సంస్కృతిని మాత్రమే ప్రామాణికంగా చూపిస్తూ, తెలంగాణ సాహిత్యాన్ని కేవలం 10-30 శాతానికి కుదించి చూపించే వివక్ష నూరేళ్లుగా సాగుతోంది. ఈ ముసుగులు ఇక చాలు. రాష్ట్రాలు వేరైనట్లే, ఎవరి చరిత్ర వారు, ఎవరి సాహిత్యం వారు స్వతంత్రంగా వేసుకోవడమే నిఖార్సైన ప్రజాస్వామిక మార్గం. ఇకపై "తెలుగు సాహిత్యం" అనకుండా, "తెలంగాణ సాహిత్యం" అనే పేరుతోనే స్పష్టంగా ప్రచారం చేయాలి. ఈ విషయం పై సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగ రాయాలి అనే పుస్తకం 2004 లోనే వెలువడింది.
ఇది తెలంగాణ మేధో లోకం నుండి ఉద్భవించిన అత్యంత సాధికారికమైన, పదునైన సైద్ధాంతిక ఘర్షణా పత్రం. 1950ల నాటి వలస పాలన నుండి నేటి 2026 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తదనంతర కాలం వరకు… అకడమిక్ వలయాలలో, సాహిత్య సంకలనాలలో సాగుతున్న " తెలుగు సాహిత్యం అనే ముసుగులో ఆధిపత్యం అవసరం లేదు.
తెలంగాణ సాహిత్య అకాడెమీ అధికారిక పత్రిక 'పునాస' (ఏప్రిల్-జూన్ 2026) లో దళిత సాహిత్య పరిణామం అర్ద సత్యాలు పావు సత్యాలతో రాయడం, అదే మొత్తం చరిత్ర అనుకునేట్టు రాయడం చాలా పొరపాటు. 40 ఏళ్ల నాటి బృహత్తర ఆధారాలను (బి.ఎస్. రాములు సిద్ధాంతాలు, సంగిశెట్టి శ్రీనివాస్ సేకరించిన సాక్ష్యాలు ఎన్నో ఉండగా తెలంగాణ పత్రికలో వాటి ప్రస్తావనైనా లేక పోవడం విచారకరం.
50 ఏళ్ల కథల సంకలనాల్లో వివక్ష
తెలుగు కథా సాహిత్యంలో సీమాంధ్ర సంకలనకర్తలు సాగించిన అక్షర ద్రోహాన్ని సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు గతంలోనే ఖచ్చితమైన లెక్కలతో (Statistical Evidence) నిరూపించారు: ఒకాయన 36 ఏళ్లుగా ఏటా వేసే కథాసంకలనం ో 14 కథల్లో రెండు మూడు తెలంగాణ కథలు వేసి ఇదే తెలుగు కథ అంటారు. ఈ వివక్షని అధిగమించడానికి తెలంగాణలో జిల్లాల వారీగా కథా సంకలనాలు వెలువడ్డాయి. సమాంతరంగా భారతీయ సాహిత్యం తెలుగు కథలు, అలాగే సంగిశెట్టి, స్కైబాబా సంపాదకత్వంలో ఏటా తెలంగాణకా సంకలనాలు వెలువడుతున్నాయి. ఇలా తెలంగాణ సొంత అస్తిత్వంతో ముందుకు సాగుతున్నది.
సంగిశెట్టి శ్రీనివాస్ పరిశోధన
సీమాంధ్ర రచయితలు "తెలంగాణలో కథ పుట్టలేదు, ఇక్కడ భాష లేదు" అని చేసిన ప్రచారాలను ప్రముఖ తెలంగాణ పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ తన అద్భుతమైన చారిత్రక లిస్టుతో, ఆధారాలతో బద్దలు కొట్టారు:
ఎవరి చరిత్ర వారిదే - సామాజిక న్యాయం
ఈ నిరంతర సంఘర్షణకు చారిత్రక అంతిమ పరిష్కారం ఒక్కటే. భౌగోళికంగా రాష్ట్రాలు వేరైపోయిన తదనంతర కాలంలో… సాంస్కృతికంగా కూడా ఎవరి సాహిత్య రేఖలు వారిగా విడిపోవడమే హుందాతనమైన మార్గం. వామపక్షాల ప్రచురణ సంస్థలు కూడా ఏ రాష్ట్రానికి వేరైపోయి నడుపుకుంటున్నారు.

