Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

తెలంగాణలో బీజేపీకి అధికారం కల్ల

- మతం పేరుతో రాజకీయాలు తగదు- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌1: మతపరమైన విభజన పైన.. మతం అనే సౌధంపైన బీజేపీ నిలబడి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

ముగ్దూం భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. బీజేపీ తెలంగాణాలో దండయాత్ర, జైత్రయాత్ర చేయబోతోందని ఆ పార్టీ నేతలు ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ కొన్ని సీట్లు గెలవొచ్చేమో కానీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల అసంతృప్తిని చూస్తున్నాం. అందుకే, సీపీఐ శ్రేణులు పోరాటాలు చేయాలి. సమస్య ఎక్కడ ఉంటే.. అక్కడ మనం ఉండాల్సిందే. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటే కనీసం ఐదు స్థానాల్లో, లేకుంటే కనీసం 15 స్థానాల్లో పోటీ చేసేలా సన్నద్ధం కావాలి. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు వేధింపులపై 4న, వోటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌)పై జూన్‌ 15న ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు చేపట్టాలి. రాష్ట్రంలో బలమైన 40 నియోజకవర్గాలను గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో పాదయాత్రలు చేపట్టాలి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, కేంద్ర.. రాష్ట్ర వైఫల్యాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక సమస్యలను పాదయాత్రల్లో ప్రస్తావించాలి. సెప్టెంబర్‌ 28వ తేదీన చలో దిల్లీ కార్యక్రమం ఉంటుంది' అన్ని అన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News