Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఉద్యమకారుల గుర్తింపుపై 4న అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4న అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.

డా.బీ.ఆర్.అంబెద్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33లో 4వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ పార్టీలను కోరింది. ఈ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయంలోకి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రవేశించేందుకు వీలుగా ముందస్తుగా రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి దేవీదాస్(87126 66004)ను సంప్రదించాలని ఒక అధికారిక ప్రకటనలో కోరారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News