Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీ గెట్)కు ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీయూహెచ్, కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీల్లో పీజీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న సీపీ గెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, వర్సిటీల వైస్ ఛాన్సలర్లు(వీసీలు), కన్వీనర్ తదితరులు విడుదల చేశారు.

తొలిసారి సీపీ గెట్‌ను తమ వర్సిటీ నిర్వహిస్తోందని కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి ఇంటర్ విద్యార్హతతో ప్రవేశాలు పొందే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ సీపీ గెట్ ద్వారా ఉండదని, వాటిని 'దోస్త్‌'లో చేర్చినట్లు తెలిపారు. కన్వీనర్ ఆచార్య రాజేందర్ మాట్లాడుతూ మొత్తం 45 స్జబెక్టులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆలస్య రుసుం లేకుండా జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 వేల ఆలస్య రుసుంతో 18 వరకు అవకాశం ఉంటుంది. జులై తొలి వారంలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు మొదటివారంలో తరగతుల ప్రారంభం. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆచార్యుల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలతో 2025 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీవో జారీ చేసినా ఇంకా ఏ వర్సిటీ ఎన్ని ఖాళీలను భర్తీ చేసుకోవాలన్నది స్పష్టత ఇవ్వలేదని ప్రతాప్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తగినంతమంది ఆచార్యులు లేకపోవడం వల్ల పరిశోధన కొంత తగ్గిందన్నారు. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ నియామకాల్లో కొంత ఆలస్యమైన విషయం వాస్తవమేనని, ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News