Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

- పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : ఉపాధి హామీ పథకం కింద వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ పనులను వేగవంతం చేయాలని, అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు.

ఈ పథకం జూన్ 30 వరకు కొనసాగుతుందని, జూలై 1 నుంచి కొత్తగా వీబీజీ రామ్‌జీ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. సచివాలయం నుంచి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌తో కలిసి ఆయన జిల్లాల కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నరేగా పనులు, చేయూత పెన్షన్ సర్వే పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం రోజుకు 15 లక్షల మంది కార్మికులు నరేగా పనుల్లో పాల్గొంటుండగా వెంటనే ఆ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని సూచించారు. ప్రతి రోజూ పనుల కోసం ముందురోజే కార్మికుల సమీకరణ చేపట్టాలని, పనులు గ్రామ హెబిటేషన్ పరిధిలోనే ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రతల దృష్ట్యా ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభించి, ప్రధాన పనులను ఉదయం 10.30 గంటలలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 40 రోజులపాటు ఎంపీడీవోలు పూర్తిగా నరేగా పనులపైనే దృష్టి సారించి పనులను వేగవంతంగా అమలు చేయాలని సూచించారు. అసైన్డ్ భూముల్లో కూడా ఫామ్‌పాండ్‌ల నిర్మాణ పనులను చేపట్టి రైతులకు ఉపయోగకరంగా మలచాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహఝీT, మహిళా సంఘాల భవనాలు వంటి నిర్మాణాలను నరేగా కింద ప్రణాళిక చేయవచ్చని తెలిపారు. గ్రామాల్లో సీసీ డ్రెయిన్‌ల శుభ్రత పనులను నిరంతరం చేపట్టి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల బ్యాంకు లింకేజి రుణాల రికవరీపై దివ్య దేవరజాన్ మాట్లాడుతూ ఎన్‌పీఏలను జీరోకి తీసుకురావడంలో జిల్లాలు ముందుండాలని తెలిపారు. ముఖ్యంగా స్త్రీ నిధి రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బ్యాంకు రుణాల మంజూరు, స్త్రీ నిధి రుణాల మంజూరు, చెల్లింపులు, ఎన్‌పీఏల నియంత్రణపై ప్రతి నెలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News