"అందులో భాగం అన్నట్లుగా నాలుగు ఏళ్ళ క్రితం కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌లో కాంగ్రెస్‌పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిందో అదే వరంగల్‌లో ఆ డిక్లరేషన్ హామీని యధావిదిగా అమలుచేయాలన్న డిమాండ్‌తో మే 6వ తేదీన రైతులతో సభ నిర్వహించాలని బిఆర్‌ఎస్ నిర్ణయించింది.
అలాగే వివిధ జిల్లాల్లో ప్రకటించిన డిక్లరేషన్ హామీలపైన కూడా ఆయా జిల్లాల్లో ఇలాంటి సభలను ఏర్పాటు చేయడంద్వారా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్దమవుతున్న బిఆర్‌ఎస్, రానున్న ఎన్నికలకు ముందస్తుగా రంగాన్ని సిద్దంచేస్తున్నట్లు కనిపిస్తున్నది."
నువ్వు ఒకటంటే.. నేను రెండంటానంటున్న మాటల యుద్ధం
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుత వేసవి ఎండల్లా రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు ఒకరికి ఒకరు తీసిపోని విధంగా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నర ఏళ్ళ కాలవ్యవధి ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఇప్పటినుండే రంగం సిద్దం చేసుకున్నట్లు కనిపిస్తున్నది. నువ్వు వెధవవంటే నువ్వు వెధవ వంటూ ఘాటుగా విమర్శించుకుంటున్నారు. గత పదేళ్ళలో పందికొక్కుల్లా దోచుకున్నారని ఒకరంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ధనార్జనకు తెగబడ్డారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ ఆరోపణలు శృతిమించడానికి జగిత్యాల బిఆర్‌ఎస్ సభ, అదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో (కాళేశ్వరం) జరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలు మరింత ఆజ్యంపోశాయి.

