Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

యూజీసీ 'నెట్‌' దరఖాస్తులకు రేపు చివరి రోజు

న్యూదిల్లీ, మే 19: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక హెచ్చరిక జారీ చేసింది.

జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ పక్రియ ఈనెల 20తో ముగియనున్నట్లు వెల్లడించింది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేయాలని సూచించింది. యూజీసీ నెట్ 2026 జూన్ 22 నుంచి 30 వరకు కంప్యూటర్- బేస్డ్ టెస్ట్ మోడ్‌లో జరగనున్నాయి. మొత్తం 85 స్జబెక్టులకు ఈ పరీక్ష జరుగుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, అలాగే పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఈ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు నింపి ఫీజు చెల్లించిన తర్వాత తప్పనిసరిగా కన్ఫర్మేషన్ పేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. ఫీజు చెల్లింపు తర్వాత మాత్రమే దరఖాస్తు పూర్తి అయినట్లు పరిగణిస్తామని స్పష్టం చేసింది. 22 నుంచి 24 వరకు సవరణలు చేసుకునే వీలుంటుంది. అడ్మిట్ కార్డులు జూన్ 15న విడుదలయ్యే అవకాశం ఉందని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్ష కేంద్ర సమాచారం అభ్యర్థులకు జూన్ 10 నాటికి తెలుస్తుంది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News