Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి 13 ఏళ్ల జైలుశిక్ష

61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి 13 ఏళ్ల జైలుశిక్ష

RTV News 1 week ago

స్ట్రేలియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 61 మంది మహిళలను భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి లైంగికంగా వేధించడం కలకలం రేపింది.

దీంతో అక్కడి కోర్టు అతడికి 13ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే భారత సంతతికి చెందిన సుమిత్ సతీష్ రస్తోగి (39) అనే వ్యక్తి 2011లో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు.

హర్మూజ్ దాటి భారత్కు చేరిన మరో LPG నౌక..

అక్కడ అడిలైడ్లో మసాజ్ థెరపిస్ట్గా పనిచేసేవాడు. అయితే 2021 అక్టోబర్ నుంచి 2022 జులై మధ్య అతడి మసాజ్ సెంటర్ వచ్చిన 61 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. అంతేకాదు 55 మంది మహిళళ ప్రైవేటు వీడియోలు రహస్యంగా రికార్డ్ చేశాడు. చివరికి బాధితులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించడంతో సతీష్పై కేసు నమోదైంది.

సరైన డ్యాక్యుమెంట్స్ లేకుండానే సుమిత్ మసాజ్ సెంటర్ను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటినుంచి ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. చివరికి నిందితుడు సతీష్ కూడా తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో తాజాగా దక్షిణ ఆస్ట్రేలియా జిల్లా కోర్టు అతడికి 13 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష విధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu