Dailyhunt
Allu Arjun :  అల్లు అర్జున్ - అట్లీ భారీ సినిమా  అప్ డేట్: రాక ఫస్ట్ లుక్ అదరహో!

Allu Arjun : అల్లు అర్జున్ - అట్లీ భారీ సినిమా అప్ డేట్: రాక ఫస్ట్ లుక్ అదరహో!

RTV News 1 week ago

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే పుట్టినరోజు కానుక అందింది. అగ్ర దర్శకుడు అట్లీతో బన్నీ చేయబోయే ప్రతిష్టాత్మక సినిమా టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాకు రాక అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

టైటిల్కు తగ్గట్టుగానే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ భీభత్సంగా ఉంది. 'రాక' అంటే రాక్షసత్వానికి ప్రతీక అని అర్థం. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విధంగా గుండుతో, క్రూరమైన గోళ్లతో ఒక మృగంలాంటి ఆకృతిలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ చూస్తుంటే సినిమాలో బన్నీ క్యారెక్టర్ చాలా డార్క్ గా, ఇంటెన్సివ్ గా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

అత్యంత భారీ బడ్జెట్తో

జవాన్, బిగిల్ వంటి వరుస బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ కథలో వింత జీవులు, రకరకాల జంతువులు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఆయన సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోందని సమాచారం.

ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా విడుదల కానుంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలవనున్న రాక, సరికొత్త దృశ్యకావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది ఒక సరికొత్త ప్రయోగం అని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu