Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bandi Bhageerath :  బండి భగీరథ్‌ కేసులో బిగ్ ట్విస్ట్..  బిగుస్తున్న ఉచ్చు

Bandi Bhageerath : బండి భగీరథ్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. బిగుస్తున్న ఉచ్చు

RTV News 6 days ago

బండి భగీరథ్కు సంబంధించిన ఫోక్సో కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణల కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్కు చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది.

ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా తాజాగా మరో అత్యంత కఠినమైన సెక్షన్ను జోడించారు.

బాధిత మైనర్ బాలికపై భగీరథ్ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో, పోలీసులు ఈ కేసులో కొత్తగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(2)(m) ను చేర్చారు. ఒకే మైనర్పై ఒకరి కంటే ఎక్కువసార్లు లేదా పునరావృతంగా అఘాయిత్యానికి ఒడిగడితే ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే భగీరథ్పై తీవ్రమైన పోక్సో (POCSO) చట్టంతో పాటు.. BNS 5(l) r/w 6, BNS 74, 75, 11, 12 వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా సెక్షన్ చేరికతో కేసు తీవ్రత మరింత పెరిగింది.

కోర్టులో నేరం రుజువైతే

కొత్తగా చేర్చిన BNS 64(2)(m) సెక్షన్ ప్రకారం గనుక కోర్టులో నేరం రుజువైతే.. నిందితుడికి కనీసం 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఈ సెక్షన్ల తీవ్రత దృష్ట్యా బండి భగీరథ్కు త్వరగా బెయిల్ రావడం కూడా దాదాపు అసాధ్యమని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కేసు తీవ్రత దృష్ట్యా, మరింత లోతుగా విచారించేందుకు, అదనపు ఆధారాలు సేకరించేందుకు పోలీసులు భగీరథ్ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నారు. బాధిత బాలికకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు, అలాగే నిందితుడి మొబైల్ డేటా, చాటింగ్స్ వంటి టెక్నికల్ ఆధారాలను పోలీసులు ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu