Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bangladesh :  ఒకేసారి పాకిస్తాన్, భారత్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!

Bangladesh : ఒకేసారి పాకిస్తాన్, భారత్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!

RTV News 4 days ago

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ జట్టును సొంత గడ్డపై క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పంది.

సిల్హెట్వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుని, పాకిస్తాన్ ను సొంత గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ వైట్వాష్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.

437 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 358 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 6 వికెట్లు పడగొట్టి విజయంలో కీ రోల్ పోషించాడు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 253 కీలక పరుగులు చేసినందుకు ముష్ఫికర్ రహీమ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. లిట్టన్ దాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అతను మొదటి ఇన్నింగ్స్లో 126 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 69 పరుగులు చేశాడు.

టీమిండియాను వెనక్కి నెట్టి

ఈ చారిత్రాత్మక విజయంతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-2027 సైకిల్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విజయంతో బంగ్లాదేశ్ గెలుపు-ఓటముల శాతం 58.33 శాతానికి మెరుగైంది. దీనితో పాయింట్ల పట్టికలో టీమిండియాను వెనక్కి నెట్టి బంగ్లాదేశ్ ఐదో స్థానానికి ఎగబాకింది. ఫలితంగా అంతవరకు ఐదో స్థానంలో ఉన్న భారత జట్టు ఆరో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu