Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bank Holidays :  జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

RTV News 2 weeks ago

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

వీటిలో ఎక్కువ శాతం సెలవులు కేవలం కొన్ని నిర్దిష్ట రాష్ట్రాలకే పరిమితం కానున్నాయి. అయితే, దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జూన్ 26న మొహర్రం సందర్భంగా ఒకేసారి పెద్ద ఎత్తున బ్యాంకులకు సెలవు ఉండనుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెలలోని రెండవ, నాల్గవ శనివారాలతో పాటు అన్ని ఆదివారాల్లో విధిగా మూసి ఉంటాయి. ఈ జూన్ నెలలో వచ్చే నాలుగు ఆదివారాలు, రెండు శనివారాల సాధారణ సెలవులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పండుగల ఆధారంగా మిగిలిన సెలవులు ఉండనున్నాయి.

జూన్ 2026లో బ్యాంక్ సెలవుల పూర్తి వివరాలు:

  • జూన్ 7: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)
  • జూన్ 13: రెండో శనివారం (దేశవ్యాప్తంగా సెలవు)
  • జూన్ 14: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)
  • జూన్ 15 (వైఎంఏ డే / రాజా సంక్రాంతి): మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు.
  • జూన్ 21: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)
  • జూన్ 25 (మొహర్రం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులకు సెలవు.
  • జూన్ 26 (మొహర్రం / అషూరా): గుజరాత్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, కేరళ, గోవా, ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జూన్ 27: నాల్గవ శనివారం (దేశవ్యాప్తంగా సెలవు)
  • జూన్ 28: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)
  • జూన్ 29 (సంత్ గురు కబీర్ జయంతి): హిమాచల్ ప్రదేశ్లో బ్యాంకులకు సెలవు.
  • జూన్ 30 (రెమ్నా ని పీస్ డే): మిజోరం రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.

బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, ఏటీఎంలు, యూపీఐ నగదు బదిలీ లావాదేవీలు ఎప్పటిలాగే 24 గంటలూ పనిచేస్తాయి. అయితే, బ్యాంకు శాఖలకు వెళ్లి చేసే నగదు డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్, పాస్బుక్ అప్డేట్లు ఇతర లోన్ సంబంధిత సేవలు మాత్రం సెలవు రోజుల్లో నిలిచిపోతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu