Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Beautician: నీట్ పేపర్ లీక్ వెనుక బ్యుటీషియన్.. వెలుగులోకి సంచలన నిజాలు

Beautician: నీట్ పేపర్ లీక్ వెనుక బ్యుటీషియన్.. వెలుగులోకి సంచలన నిజాలు

RTV News 6 days ago

ఏడాది మే 3న నిర్వహించిన నీట్ యూజీ పేపర్ లీక్(neet-paper-leak) కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ భారీ కుట్ర వెనుక పుణెకు చెందిన 46 ఏళ్ల బ్యూటీషియన్(Beautician) మనీషా వాఘ్మారే ఉన్నట్లు సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మే 14న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెపై విచారణ కొనసాగుతోంది. మనీషా వాఘ్మారే ఇచ్చిన సమాచారం ఆధారంగానే పుణెకు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని, ఆ తర్వాతి రోజు బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మందరేను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

నీట్ ప్రశ్నపత్రాల తయారీ ప్యానల్లో మనీషా గురునాథ్ సభ్యురాలిగా. ఆమెకు బోటనీ, జువాలజీ పేపర్ల యాక్సెస్ ఉంది. ఈ విషయాన్ని గమనించిన బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే.. ప్రొఫెసర్ గురునాథ్తో కలిసి పేపర్ లీక్ చేయాలని ప్లాన్ వేసింది. వీళ్ల ప్లాన్లోకి కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణిని కూడా జత చేసుకున్నారు. దీంతో పరీక్షలో వచ్చే ప్రశ్నలకు భారీగా డబ్బులు ఇవ్వగల విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ చేరవేసేందుకు వీళ్లందరూ కలిసి కుట్ర పన్నినట్లు సీబీఐ.. కోర్టుకు వెల్లడించింది.

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. S-400 రక్షణ వ్యవస్థలపై భీకర దాడులు

Beautician Key Link In NEET-UG Paper Leak

తమ ప్లాన్లో భాగంగా నీట్ క్వశ్చన్ పేపర్లను కొనగలిగే ధనిక విద్యార్థులను వెతికే బాధ్యతను బ్యూటీషియన్ వాఘ్మారే తీసుకుంది. కొందరు విద్యార్థులను గుర్తించి.. వాళ్లలో ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల చొప్పున డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ విషయాన్ని ఆమె తన స్వేహితుడు ధనంజయ్ లోఖండేకు కూడా చెప్పింది. దీంతో ఇతడు నాసిక్లో కౌన్సెలింగ్ వ్యాపారం నిర్వహించే శుభమ్ ఖైర్నార్ను సంప్రదించాడు. వాఘ్మారే నుంచి ధనంజయ్కు, అక్కడి నుంచి శుభమ్కు చేరిన నీట్ ప్రశ్నపత్రాల పీడీఎఫ్ (PDF)లు చేరాయి. దీంతో అతడు గురుగ్రామ్, జైపూర్లోని ఇతర ఏజెంట్లకు కూడా ఫార్వార్డ్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

మరోవైపు ఈ నెట్వర్క్కు సంబంధించి మహారాష్ట్రలో కూడా మరో అరెస్టు జరిగింది. లాతూర్లోని ప్రముఖ 'రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్' (RCC) ఫౌండర్ శివరాజ్ రఘునాథ్ను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీని, దాన్ని ఇతరులకు పంపిణీ చేసిన గ్యాంగ్లో శివరాజ్ ఒక సభ్యుడిగా ఉన్నట్లు విచారణలో తేలింది. సీబీఐ జరిపిన సోదాల్లో భాగంగా అతడి మొబైల్ ఫోన్లో లీక్ అయిన నీట్ క్వశ్చన్ పేపర్ దొరికింది. పక్కా ఆధారాలతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఈ వరుస అరెస్టులు చూస్తుంటే నీట్ లీకేజీ మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో అర్థమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu