Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BIG BREAKING: భారీ వర్షాలు.. ఒక్కరోజులోనే 89 మంది మృతి

BIG BREAKING: భారీ వర్షాలు.. ఒక్కరోజులోనే 89 మంది మృతి

RTV News 1 week ago

సాధారణంగా మే నెలలో ఎండలు మండిపోతుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాలు, గాలిదుమారం రాష్ట్రవ్యాప్తంగా అతలాకుతలం చేసింది. బుధవారం అక్కడ కురిసిన భారీ వర్షానికి, పిడుగల ఘాటికి ఏకంభారీ వర్షం..

ఒక్కరోజులోనే 89 మంది మృతిగా 90 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందకు పైగా పశువులు మృతి చెందాయి. బలమైన గాలుల వల్ల ఇప్పటిదాకా ఏకంగా 87 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఈ వర్షాల ప్రభావానికి ప్రయాగ్రాజ్లో అత్యధికంగా 21 మంది మరణించారు. భదోహిలో 16, ఫతేపుర్లో 11, సంత్ రవిదాస్ నగర్లో 14, మీర్జాపుర్లో 10 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

21 ఏళ్ల లోపు వారికి నో లిక్కర్.. CM విజయ్ మరో సంచలనం

ఈ విషాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్ష ప్రభావానికి గురైన బాధితులకు అండగా ఉండాలని, ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశాలు జారీ చేశారు.

సాధారణంగా వేసవిలో భూఉపరితలంపై ఉండే వేడి గాలి, ఇతర దిశల నుంచి వచ్చే తడి గాలితో కలిసిన సమయంలో 'క్యుములోనింబస్' మేఘాలు ఏర్పడతాయి. వీటి ప్రభావంతోనే చాలా తక్కువ సమయంలో పెనుగాలులు, వడగళ్ల వాన, పిడుగులు సంభవిస్తాయి. ప్రస్తుతం ఉత్తర భారత్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వచ్చిన ఈ భౌగోళిక మార్పుల వల్లే ఉత్తరప్రదేశ్లో ఇలాంటి పెను బీభత్సం సృష్టించబడిందనట్లు అధికారులు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu