Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BIG BREAKING: కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన.. ఆ మంత్రులు అవుట్

BIG BREAKING: కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన.. ఆ మంత్రులు అవుట్

RTV News 3 days ago

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది పైకి సాధారణ రివ్యూ మీటింగ్లా కనిపిస్తున్నప్పటికీ..

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు, ప్రవర్తన, వివాద రహిత ఇమేజ్ లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాతిక మందికి పైగా మంత్రులకు ఇదే చివరి మీటింగ్ కావచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మోదీ సర్కార్ 30 మంది క్యాబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన అయిదుగురు మంత్రులతో కలిపి మొత్తం 72 మంది సభ్యులు ఈ ఏడాది మొదటిసారి ఒకే చోట సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాబోయే పదేళ్లలో వంద ఎయిర్పోర్టులు.. కేంద్రమంత్రి కింజరాపు కీలక ప్రకటన

ఈ సమావేశంలో కేవలం రాజకీయ సమీకరణాలే కాక దేశ ప్రగతి, అంతర్జాతీయ సవాళ్లపై కూడా ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. గత రెండేళ్లలో ఏ మంత్రిత్వ శాఖలు విజయాలు సాధించాయి ?, కేంద్ర సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి ? అలాగే రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కేంద్రం చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణ, ప్రతిపాదిత సంస్కరణలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రజలపై వీలైనంత తక్కువ భారం పడేలా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ మీటింగ్ సందర్భంగా దాదాపు డజనుకు పైగా కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, మంత్రులు తమ శాఖల పనితీరు, సాధించిన విజయాలపై స్పెషల్ ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు, అలాగే పుదుచ్చేరిలో NDA కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ రాజకీయ మార్పులు మంత్రివర్గ విస్తరణపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి త్వరలోనే కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొడుకు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం తెలుగు రాష్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భగీరథ్ రిమాండ్లో ఉన్నాడు. మరోవైపు బండి సంజయ్పై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తన కొడుకును జైలుకు వెళ్లకుండా చూసేందుకు బాధిత కుటుంబాన్ని బెదిరించనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బండి సంజయ్ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ మంత్రివర్గ ప్రక్షాళనలో బండి సంజయ్ పదవి ఉంటుందా ? లేదా ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరో బొగ్గు, గనులశాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా కొనసాగుతారా ? లేదా ? అనేది కూడా ఆసక్తిగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu