Dailyhunt
BIG BREAKING: సీఎం పదవికి రాజీనామా చేయను.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

BIG BREAKING: సీఎం పదవికి రాజీనామా చేయను.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

RTV News 1 week ago

మతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయనని తెలిపారు. మేం ఎన్నికల్లో ఓడిపోలేదని.. గెలిచాం అని పేర్కొన్నారు. మా ఓట్లను చోరీ చేశారని ఆరోపించారు.

అందుకే లోక్‌భవన్‌కు వెళ్లను, గవర్నర్‌ రాజీనామా లేఖ ఇవ్వనని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందని విమర్శించారు.

'' ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులు కాలరాశారు. EVMలను తారుమారు చేస్తూ సీఈసీ విలన్‌గా మారారు. పోలింగ్ ముగిసిన అనతంర కూడా EVMలలో 80 నుంచి 90 శాతం ఛార్చ్ ఉంటుందా? ఇదెలా సాధ్యం అవుతుంది. ఎన్నికలకు రెండ్రోజుల ముందు మా పార్టీ శ్రేణులను అరెస్టు చేయడం ప్రారంభించారు. అన్నిచోట్ల కూడా సోదాలు చేశారు. IAS, IPS అధికారులను మార్చేశారు. ఎన్నికల సంఘంతో బీజేపీ గేమ్ ఆడింది. SIR పేరుతో 90 లక్షల ఓటర్లను తొలగించారు. మేము కోర్టుకు వెళ్లాక 32 లక్షల పేర్లు చేర్చారు.

ఓట్ల లెక్కింపులో భారీగా అవకతవకలు జరిగాయి. ఏకంగా 100 స్థానాల్లో మా విజయాన్ని కాజేశారు. TMC మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకే ఓట్ల లెక్కింపు ప్రక్రియను నెమ్మదిగా చేపట్టారు. ఇది చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని'' మమతా బెనర్జీ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu