Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BREAKING: దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్..

BREAKING: దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్..

RTV News 4 days ago

న్లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాల (AIOCD, TTCDA) పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నిరసనల ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25 వేలకు పైగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఒక్క హైదరాబాద్లోనే ఏకంగా 12 వేల మెడికల్ దుకాణాలు తెరుచుకోలేదు. ఈ-ఫార్మసీల వల్ల సంప్రదాయ ఔషధ వ్యాపారులకు నష్టం జరుగుతోందని.. రూల్స్కు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ విక్రయాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అలా చేస్తే అకౌంట్లోకి వెంటనే రూ. లక్ష!

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలకు, రోగులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలెర్ట్ అయ్యింది. ప్రజల అత్యవసర వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), బస్తీ దవాఖానాలతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఫార్మసీలను బుధవారం 24 గంటల పాటు నిరంతరాయంగా తెరిచి ఉంచాలని మార్గదర్శకాలు జారీ చేశారు.

ప్రధాని మోదీపై జాత్యాహంకార కార్టున్.. నార్వే పత్రికపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ప్రైవేటు రంగంలో రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అపోలో, మెడ్ప్లస్ లాంటి కార్పొరేట్ మెడికల్ స్టోర్ల నిర్వాహకులు తమ దుకాణాలను యథావిధిగా ఒపెన్ చేసి ఉంచాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (DCA) డీజీ విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మందుల లభ్యత కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు అత్యవసరంగా ఔషధాలు కావాలంటే సంప్రదించేందుకు వీలుగా 1800-599-6969 అనే ప్రత్యేక టోల్ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu