దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా దళాలు నిరంతరం సాగిస్తున్న ప్రయత్నాల్లో ఓ కీలక విషయం బయటపడింది. పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో భద్రతా సంస్థలు, స్థానిక పోలీసులు కలిసి అత్యంత సున్నితమైన గూఢచర్య నెట్వర్క్ను ఛేదించారు.
భారత సైన్యం, పారామిలిటరీ దళాలకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్ని పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో పంచుకుంటున్నారనే ఆరోపణలపై సుజన్పూర్ పోలీసులు ఓ ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టుబడ్డ నిందితుడిని బల్జీత్ సింగ్ అలియాస్ బిట్టుగా గుర్తించారు.
నీట్ ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల మార్పుకు చాన్స్
అయితే పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. పఠాన్కోట్-జమ్మూ జాతీయ రహదారిపై సుజన్పూర్ దగ్గర్లోని 4, 5 నంబర్ వంతెనల మధ్య కొన్ని దుకాణాల వద్ద నిందితులు సీక్రెట్గా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఈ రూట్ గుండా వెళ్లే భారత సైన్యం, పారామిలిటరీ దళాల కాన్వాయ్లు, వాళ్ల కదలికలపై నిఘా ఉంచుతున్నారు. ఈ కెమెరాల ద్వారా సేకరించిన ప్రత్యక్ష వీడియో ఫీడ్లను, నిఘా నివేదికలను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేరుగా పాక్లో ఉన్న తమ హ్యాండ్లర్లకు, విదేశాల్లో ఉన్న గూఢచారులకు చేరవేస్తున్నట్లు తెలిసింది. దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు ఈ ఉదంతం తీవ్ర ముప్పుగా పరిణమించింది.
పుల్వామా పాపానికి ముగింపు.. పీవోకేలో కరడుగట్టిన ఉగ్రవాది హతం!
ఈ గూఢచర్యానికి పాల్పడుతున్న నలుగురు నిందితులపై సుజన్పూర్ పోలీస్ స్టేషన్లో అధికార రహస్యాల చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో పరారీలో ఉన్న మిగిలిన నిందితులు సుజన్పూర్కు చెందిన విక్రమ్జిత్ సింగ్ అలియాస్ విక్కా, బల్వీందర్ సింగ్ అలియాస్ విక్కీ, తరణ్ప్రీత్ సింగ్ అలియాస్ తన్నులుగా పోలీసులు గుర్తించారు. సరిహద్దుల అవతల ఉన్న ఈ నెట్వర్క్ లింక్స్, ఇందులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులు, వాళ్లకు అందుతున్న నిధుల మూలాలపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్థానిక మేజిస్ట్రేట్తో పాటు ఉన్నతాధికారులకు కూడా స్పెషల్ రిపోర్ట్ను సమర్పించారు.

