Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BREAKING: తెలంగాణ, ఏపీలో సర్‌ ఎప్పుడంటే ?

BREAKING: తెలంగాణ, ఏపీలో సర్‌ ఎప్పుడంటే ?

RTV News 1 week ago

కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఝార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పంజాబ్, సిక్కిం, కర్ణాటక, నాగాలాండ్, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.

సీఎం విజయ్ మరో సంచలనం.. దెబ్బకు పెరిగిన జీతాలు.. 16 లక్షల మందికి గుడ్ న్యూస్!

తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకు సర్ గురించి సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. అదే రోజు నుంచి సెప్టెబర్ 28 దాకా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.

పాపం కేసీ వేణుగోపాల్.. ఎందరినో సీఎం, మంత్రులుగా చేసి.. ఆయన విషయంలో అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జూన్ 5 నుంచి 14 వరకు SIRపై సిబ్బందికి శిక్షణ ఉంటుంది. జూన్ 15 నుంచి జులై 14 వరకు సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత జులై 21న ఓటర్ల ముసాయిదా లిస్టును ప్రకటిస్తారు. ఇక జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. చివరగా సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ మూడో దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ లెవెల్ అధికారులు, 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. మొత్తానికి డిసెంబర్ 23న త్రిపురతో మూడో దశ SIR ప్రక్రియ ముగుస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu