Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BREAKING: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

BREAKING: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

RTV News 1 day ago

తెలంగాణలో ఎండల తీవ్రత భయాందోళన రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ తగిలి ఇప్పటివరకు 34 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. రోహిణి కార్తె ప్రభావానికి తోడు వాయువ్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి.

ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లలో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ పరిసర జిల్లాల్లో వడదెబ్బ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.

వాహనాదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితుల వల్ల భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తర, తూర్పు తెలంగాణలో 18 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉందని, ప్రజలు అత్యంత అలెర్ట్ ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నిరంతరం నీళ్లు, మజ్జిగ లేదా ORS ద్రావణం తీసుకుంటూ డీహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తపడాలని సూచనలు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu