Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bullet Train: ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ఫస్ట్‌ లుక్..

Bullet Train: ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ఫస్ట్‌ లుక్..

RTV News 6 days ago

భారత్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైలుకు సంబంధించిన తొలి అధికారిక ఫొటోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసింది.

ఢిల్లీలోని రైల్వే శాఖ భవనం వద్ద సోమవారం ఈ బుల్లెట్ రైలు ఫొటోను తీశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరిక

గంటకు దాదాపు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఈ రైలును రూపొందించారు. ఈ హైస్పీడ్ కారిడార్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ముంబయి- అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ రెండు పారిశ్రామిక నగరాల మధ్య ప్రయాణించేందుకు రైలు లేదా రోడ్డు మార్గంలో ప్రస్తుతం 7 గంటలకు పైగా సమయం పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ప్రాథమిక నమూనా ప్రకారం ఈ రైలులో 8 అడ్వాన్స్‌డ్ కోచ్‌లు ఉండనున్నాయి.

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. S-400 రక్షణ వ్యవస్థలపై భీకర దాడులు

ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న ఈ ప్రత్యేక కారిడార్‌లో మొత్తంగా 12 స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇందులో సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే, అలాగే ముంబయి స్టేషన్లు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టును దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి దశలో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌- బిలిమోరా మధ్య ఉన్న మొదటి 100 కిలోమీటర్ల మార్గాన్ని 2027 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu